Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 5, 2026Short Read
నిజాన్ని ఎదుర్కోలేకనే మీడియాలపై ఆంక్షలు: సీఎం చంద్రబాబుపై రోజా ఫైర్
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఏపీ ప్రభుత్వం మీడియా సంస్థలపై ఆంక్షలు విధిస్తోందని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుల పక్షాన నిలబడుతున్న మీడియాని అడ్డుకోవడం ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.
సాక్షి డిజిటల్, బిగ్ టీవీలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను దేశంలో కనిపించకుండా చేయడం ఆయన భయానికి నిదర్శనమని విమర్శించారు.
నిజాన్ని ఎదుర్కోలేని చంద్రబాబు పిరికితనానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని రోజా 'ఎక్స్ (X)' వేదికగా మండిపడ్డారు.





